- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : ఆగం చేసి..అధికారులపై కక్ష సాధింపులా? కేటీఆర్
చేతకాని పాలనతో తెలంగాణ(Telangana)ను పూర్తిగా ఆగం చేసి, వాస్తవాలను బయటపెట్టిన అధికారులపై కక్షకట్టడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)మూర్ఖత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : చేతకాని పాలనతో తెలంగాణ(Telangana)ను పూర్తిగా ఆగం చేసి, వాస్తవాలను బయటపెట్టిన అధికారులపై కక్షకట్టడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)మూర్ఖత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో బీఆర్ఎస్ దార్శనిక పాలనకు, దద్దమ్మ కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన తేడా, నాలుగు కోట్ల సమాజం ముందు బట్టబయలు కావడంతో ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో సాధించిన ఘనమైన గతాన్ని తొక్కిపెట్టడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఈ సీఎం గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశాడు. 14 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చాలదన్నట్టు, ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు దిగడానికి సీఎంకు సిగ్గనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని, తలకు మాసిన నిర్ణయాలతో దివాళా తీసే స్థితికి తెచ్చి ఇప్పటికే క్షమించరాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించాడు.
వాస్తవ గణాంకాలను జీర్ణించుకోలేక, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ చిల్లర చేష్టలు మానుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయరంగంలో సాధించిన విప్లవం, పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిన ప్రగతి పథం.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా పదిలమని పేర్కొన్నాడు. కేవలం వైబ్ సైట్ నుంచి రిపోర్టులను తొలగించినంత మాత్రాన, చేయని తప్పుకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన.. తెలంగాణ పదేళ్ల ముఖచిత్రాన్ని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన స్వర్ణయుగాన్ని చెరిపేయడం ఈ ముఖ్యమంత్రి వల్లే కాదు.. ఢిల్లీ పార్టీ ముత్తాతలకు కూడా సాధ్యం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.






