కస్టోడియల్ డెత్ కేసు.. తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

by Malleboina Mahesh |

తెలంగాణలో దళిత యువకుడు రాజేష్ కస్టడీ మరణంపై NHRC సీరియస్.. థర్డ్ డిగ్రీ ఆరోపణలపై 3 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం!

కస్టోడియల్ డెత్ కేసు.. తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కస్టోడియల్ డెత్ కేసులో తెలంగాణ పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు రాజేష్ కస్టడీ మరణం (Custodial Death) కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్, ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపి 3 వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీ (DGP) మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

థర్డ్ డిగ్రీ చిత్రహింసల వల్లే మృతి..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాల ఆరోపణల ప్రకారం.. దళిత యువకుడైన రాజేష్‌ను పోలీసులు ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా అక్రమంగా నిర్బంధించారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌లో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు ఉపయోగించారని, పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే రాజేష్ కస్టడీలోనే ప్రాణాలు విడిచాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. లాకప్‌ డెత్‌కు కారణమైన బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌లు వస్తున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. 3 వారాల గడువులోగా నివేదిక ఇవ్వని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని కమిషన్ పోలీసులకు స్పష్టం చేసింది.

Next Story