టెట్ తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్టీఎఫ్ఐ రివ్యూ పిటిషన్

by Ajay Maddhiboyina |

స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపనున్న సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మంగళవారం నాడు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని ఈ పిటిషన్‌లో కోరారు.

టెట్ తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్టీఎఫ్ఐ రివ్యూ పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపనున్న సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మంగళవారం నాడు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి పేరిట న్యాయవాది సుభాష్ చంద్రన్ ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుండి రిటైర్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

అంతేకాకుండా, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ కావాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని ఆ తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ సెప్టెంబర్ 17న ఎస్టీఎఫ్ఐ నాయకత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా, టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రివ్యూ పిటిషన్లు వేయాలని వారు కోరారు.

Next Story