- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటి క్యాన్సర్ నివారణకు చర్యలు చేపట్టాలి: ఎంపీ వద్దిరాజు
సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

దిశ, తెలంగాణ బ్యూరో: బీడీ కార్మికులు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని వేలాది కుటుంబాలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరించారు. నోటి క్యాన్సర్ నివారణకు, ప్రజలు వ్యసనాలకు లోనుకాకుండా కేంద్ర ప్రభుత్వం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లుపై-2025 రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి దేశ ఆర్థిక పురోగతికి విశేష కృషి చేశారని అన్నారు.
తెలంగాణ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న గౌడ కులస్తుల సంక్షేమంలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మద్యం అమ్మకాలకు సంబంధించి సరైన పర్యవేక్షణ, తనిఖీలు, నియంత్రణ లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం బ్లాక్ మార్కెట్, కల్తీ మద్యం, బెల్ట్ షాపుల్లో విరివిగా అందుబాటులో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు బాగా పెరగడంతో సామాజిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కల్తీని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. కాగా.. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతునిస్తున్నదని చెప్పారు. సామాజిక కోణంలో కాకుండా ఆర్థిక సంబంధమైన ముఖ్యమైన అంశాలతో కూడిన ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.






