మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి

by Elthuri vijay kumar |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు చర్యలు చేపట్టాలని, వారి సంక్షేమంకోసం ప్రత్యేక పధకాలు రూపొందించి అమలు చేయాలనీ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు.

మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి
X

మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి

- మహిళలు ఆర్థికాభివృద్ధి సాధన దిశగా కృషిచేయాలి

- స్వయం ఉపాధి రంగాలవైపు దృష్టి సారించాలి

- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

- 120మంది మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ

దిశ, కొత్తగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు చర్యలు చేపట్టాలని, వారి సంక్షేమంకోసం ప్రత్యేక పధకాలు రూపొందించి అమలు చేయాలనీ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ పరిధిలో 120 మంది లబ్దిదారులకు మంజూరైన కుట్టు మిషన్లను మంగళవారం కొత్తగూడెం క్లబ్బులో అందించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ... మహిళలు వంటింటికే పారిరిమితం కాకుండా ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, ఆర్థికాభివృద్ధి సాధించి కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. ప్రభుత్వాలు తరచూ హామీలు ఇచ్చినా, మైనార్టీల అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. మైనార్టీ పేదల కష్టాలు తగ్గించేలా చిన్న స్థాయి ఉపాధి సాధనాలు, ఆర్థిక ప్రోత్సాహం అందితేనే నిజమైన శక్తివంతమైన సమాజం నిర్మించవచ్చని తెలిపారు. మైనార్టీ సంస్థల ద్వారా పంపిణి చేస్తున్న ఈ కుట్టు మిషన్లు స్వయం ఉపాధికి పునాది వేస్తాయని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. మహిళలను, నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, ఉపాధి పరికరాలు అందించేంకు స్వత్చంద సంస్థలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, తహసీల్దార్ పుల్లయ్య, నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story