సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య

by Dishafeatures2 |
సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య
X

దిశ, వెబ్ డెస్క్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జానకిపురం సర్పంచ్ నవ్య మీడియాకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఇదేం పాడు పని అంటూ ఎమ్మెల్యే రాజయ్యను ప్రతి ఒక్కరూ విమర్శించారు. సోషల్ మీడియాలో రాజయ్యపై ట్రోల్స్ మీద ట్రోల్స్ వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా రాజయ్యపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆదివారం సర్పంచ్ నవ్య ఇంటికి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆయన సర్పంచ్ తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. అనంతరం సర్పంచ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. తన సమస్య గురించి చర్చించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తాను మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్క విషయం నిజమేనని ఎమ్మెల్యే సాక్షిగా తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల విషయంలో మహిళలు ఎవరూ కూడా వెనకడుగు వేయవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురవుతున్నవారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటున్నాని తెలిపారు.

Read more:

మళ్లీ రెచ్చిపోయిన సర్పంచ్ నవ్య.. MLA రాజయ్య రియాక్షన్ ఇదే!



Next Story

Most Viewed