న్యూఢిల్లీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

by velandi.Saikiran |

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.

న్యూఢిల్లీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.శశాంక్ గోయల్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story