RTC Mazdoor Union: రేపు తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు

by Ramesh Naini |

తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు తెలిపింది.

RTC Mazdoor Union: రేపు తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservations) ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన జేఏసీ పిలుపునిచ్చిన రేపటి (అక్టోబర్‌ 18) తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం (RTC Telangana Mazdoor Union) ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్‌ సెక్రటరీ థామస్‌ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ జీఓపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ జేఏసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ద్వారా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బంద్‌ పిలుపునిచ్చిందని తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ పూర్తి మద్దతు తెలుపుతూ, ఆర్టీసీ కార్మికులు బంద్‌లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story