DCCలపై రాష్ట్ర అధినాయకత్వం ఫోకస్.. రేపు హైదరాబాద్‌కు AICC పరిశీలకులు

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్​ సంస్థాగత నిర్మాణాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.

DCCలపై రాష్ట్ర అధినాయకత్వం ఫోకస్.. రేపు హైదరాబాద్‌కు AICC పరిశీలకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్​ సంస్థాగత నిర్మాణాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధిష్టానం భావిస్తున్నది. ఈ ప్రక్రియపై ఇప్పటికే ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు ముందస్తు షెడ్యూల్​ప్రకారం ఈనెల 4 నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉండగా, స్థానిక ఎన్నికల దృష్ట్యా నిలిచిపోయింది. దీంతో ఈనెల 11 నుంచి ఏఐసీసీ పరిశీలకులకు హైదరాబాద్‌కు రానున్నారు. క్షేత్రస్థాయిలో జిల్లా ఇన్ చార్జి​మంత్రులు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను కలిసి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అధిష్టానం ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించనుంది. ఈనెలాఖరులోగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చినందున కొంత సమయం ఉండటంతో డీసీసీల నియామక ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు వారి నాయకత్వంలో వెళ్లే అవకాశం లభించిందని హస్తం పార్టీ వర్గాలు చెప్పాయి. ఇది రాజకీయ పరంగా కాంగ్రెస్​కు కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Next Story