Interest free Loans: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే వడ్డీలేని రుణాలు

by Kema Shiva Kumar |

ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది.

Interest free Loans: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే వడ్డీలేని రుణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. అదేవిధంగా రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ అందజేస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా క్రాంతి పథకాన్ని ఈ నెల 12న ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Next Story