Election Commission: ఓటర్ల తుది జాబితాపై అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

by Ramesh Naini |

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు పార్టీలు సన్నద్ధం కావడంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసింది.

Election Commission: ఓటర్ల తుది జాబితాపై అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు పార్టీలు సన్నద్ధం కావడంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Telangana State Election Commission) ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, (final voters list) తుది ఓటర్ల జాబితా విడుదలకు తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలాయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 29న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.

Next Story