రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు.. మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా వెల్లడి

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు.. మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించింది. ఈ ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్తార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ ఆఫీసులోనూ నోటీసు బోర్డులో ప్రచురించారు. దీంతో పాటు మున్సిపల్ వార్డుతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ జాబితాను ప్రచురించారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించడంతోపాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత ఈనెల 10వ తేదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

Next Story