- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త
వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు, 13 గిరిజన తాండాల్లోని దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kashimnagar Lift Irrigation Project)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు, 13 గిరిజన తాండాల్లోని దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kashimnagar Lift Irrigation Project)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. రేపు ఆదివారం సర్వే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారని చిన్నారెడ్డి(Chinna Reddy) స్పష్టం చేశారు. ఈ లిప్ట్ ఇరిగేషన్ కింద కాశీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తయిపల్లి, అంజనగిరి గ్రామాలతోపాటు మరో 13 గిరిజన తాండాలకు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని పేర్కొన్నారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్(Kalvakurti Lift Irrigation) సహా ఇతర ప్రతిపాదిత నీటి వనరులకు ఈ ప్రాంతం ఎత్తుగా ఉండటం వల్ల కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) శుభవార్త చెప్పిందని చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం వనపర్తిలో జరిగే బహిరంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.






