- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram: రహస్యంగా కొనసాగుతున్న గద్దెల పునఃప్రతిష్టాపన కార్యక్రమం
మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నారు. పగిడిద్దరాజు (Pagididda Raju), గోవిందరాజు (Govinda Raju) గద్దెల పునఃప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా రహస్యంగా పూజా కార్యక్రమాలను పూజారులు నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగనున్న పూజాకార్యక్రమాల క్రతువు కొనసాగనుంది. మరో వైపు గద్దెల పునఃప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో ఇవాళ మేడారంలో భక్తులకు వన దేవతల దర్శనాలు నిలిపివేశారు. ఈ చారిత్రాత్మక పనులు సజావుగా సాగేందుకు భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సహకరించాలని పూజారులు విజ్ఞప్తి చేశారు.
కాగా వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర (Medaram Maha Jathara 2026) జరగనుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగ పేరుగాంచిన మేడారం జాతరను ఈసారి కొత్త రూపులో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతుండగా నిన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పరిశీలించారు.






