- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాలక్ష్మి పథకం సమర్థవంతంగా అమలుకు సిబ్బంది కృషి : టీజీఎస్ఆర్టీసీ
ప్రజా రవాణా వ్యవస్థకు మేలు చేస్తూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోన్న మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు టీజీ ఎస్ఆర్టీసీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా రవాణా వ్యవస్థకు మేలు చేస్తూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోన్న మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు టీజీ ఎస్ఆర్టీసీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ఎక్స్‌వేదికగా పేర్కొంటూ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో సిబ్బంది క్రియాశీల పాత్ర ఉంది. ఆర్టీసీ కుటుంబం సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తుండటంతో ఉచిత బస్సు సదుపాయాన్ని అన్ని వర్గాల మహిళామణులు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు నిబద్దతతో ఉన్నారని యాజమాన్యం స్పష్టం చేసింది.
Next Story






