- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SSREC కంపెనీకి విశ్వకర్మ అవార్డు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ, తరలింపు, స్థిరమైన పద్ధతులు, విధానాల్లో చేస్తోన్న విశేష కృషికి గాను ఎస్ఎస్ఆర్ఈసీ (సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్) సంస్థకు విశ్వకర్మ అవార్డు లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ, తరలింపు, స్థిరమైన పద్ధతులు, విధానాల్లో చేస్తోన్న విశేష కృషికి గాను ఎస్ఎస్ఆర్ఈసీ (సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్) సంస్థకు విశ్వకర్మ అవార్డు లభించింది. కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్, న్యూ ఢిల్లీ వారి నుంచి ఈ అవార్డును అందుకున్నారు. కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ని ప్లానింగ్ కమిషన్/నీతి అయోగ్ స్థాపించింది. ప్రతిష్ఠాత్మక ఈ అవార్డును శుక్రవారం రాత్రి న్యూ ఢిల్లీలోని డా.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో అందుకున్నారు. కేంద్ర మంత్రి హర్ష మల్హోత్ర, భవన నిర్మాణ వ్యర్ధాల నిర్వహణ విభాగం డైరెక్టర్ బి.రఘురాంలు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సోమ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది కూడా భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగం నుంచి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడం వెనుక కంపెనీ ఉద్యోగుల కృషి చాలా ఉందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.






