సమ్మక్క - సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-13 12:47:27  IST  )

సమ్మక్క- సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో (SSCTU) ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సమ్మక్క - సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మక్క- సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో (SSCTU) ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో కొత్త అకడమిక్ ప్రోగ్రామ్స్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే SSCTUలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, డెవలప్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్ ఇంగ్లీష్ విభాగాల్లో అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.ssctu.ac.inను సందర్శించవచ్చని రాంరెడ్డి తెలిపారు. జూన్ 21వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు జీతాలు ఉంటాయని స్పష్టం చేశారు. అత్యంత ప్రతిభ ఉన్న, వృత్తిపరమైన అనుభవం ఉన్నవారికి అధిక జీతం ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

Next Story