- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండె జబ్బులకు శస్త్రచికిత్సలేని పరిష్కారం..! బయోటెక్నాలజీలో మార్పులతో సాధ్యమేనా?
ఇప్పటి వరకు శస్త్ర చికిత్స లేకుండా సాధ్యం కాని ఆరోగ్య సమస్యలు సైతం బయో టెక్నాలజీలో మార్పులతో ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : గుండెపోటుకు దారితీసే ప్రధాన కారణాల్లో ఆర్టెరీస్ బ్లాక్స్(Artery Block) కూడా ఒకటి. ధమనుల్లో చిన్న చిన్న ప్లాక్స్ ఏర్పడి, రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఇది సంభవిస్తుంది. కాబట్టి.. ఈ సమస్యకు శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది. అయితే ఇటీవల బయోటెక్నాలజీలో వస్తు్న్న మార్పులు శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ధమనుల్లో ఆటంకాలను తొలగించే మార్గాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పటి వరకు శస్త్ర చికిత్స లేకుండా సాధ్యం కాని విషయాలు సైతం ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి. ముఖ్యంగా.. ధమనుల్లో (arteries) ఏర్పడే ప్లాక్‌ను కరిగించే నిర్దిష్ట ఎంజైములను గుర్తించగలిగితే.. గుండె ఆరోగ్య సంరక్షణలో ఒక మైలురాయిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. నిజానికి ధమనుల్లో ఏర్పడే ప్లాక్ అనేది కొవ్వులు, కొలెస్ట్రాల్, కాల్షియంలతో కూడిన మిశ్రమం. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుని, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు శస్త్రచికిత్స చేయకుండానే వీటిని కరిగించే ఎంజైమ్ థెరపీని అభివృద్ధి చేయడంపై వైద్య పరిశోధకులు, అలాగే అందుకు సంబంధించిన సాంకేతిక ఆవిష్కరణలపై సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు.
ధమనుల్లో బ్లాక్స్‌ను తొలగించే టార్గెటెడ్ ఎంజైమ్ థెరపీ అందుబాటులోకి వస్తే గనుక.. రక్త ప్రసరణ వ్యవస్థను లోపలి నుంచి శుభ్రం చేసి, ఆటంకాలను తొలగిస్తుంది. తిరిగి గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే గుండె జబ్బులను పూర్తిగా తిరిగి మార్చడం (Reversing Heart Disease) ఇప్పుడు కేవలం ఒక కల కాదు.. ఆధునిక సాంకేతికతవల్ల వాస్తవిక లక్ష్యంగా మారుతోందని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధనలు భవిష్యత్తులో గుండె సమస్యలకు, క్లిష్టమైన ఆపరేషన్ల అవసరం లేకుండానే.. ఆధునిక జీవసాంకేతిక పరిష్కారాల ద్వారా చక్కటి పరిష్కారం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకైతే ధమనుల్లో ప్లాక్స్‌ను కరిగించే ఎటువంటి ఎంజైమ్ థెరపీ అందుబాటులో లేదు. కేవలం ప్రయోగాత్మక దశలో మాత్రమే ఉంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






