- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8096958096 నంబర్‌లో ‘Hi’ అంటే చాలు.. SSC రిజల్ట్స్ డైరెక్ట్‌గా మీ ఫోన్‌కే..
ఎస్సెస్సీ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

దిశ, వెబ్‌డెస్క్ : గత ఏడాది ప్రారంభమైన మీ సేవ WhatsApp/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ సేవాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి క్షణాల్లో ఫలితాలను చూసుకునే సదుపాయాల్ని కల్పిస్తోంది. ఎస్సెస్సీ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం, SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది. బుధవారం (రేపు) మధ్యాహ్నం 2:30 గంటల నుండి వాట్సాప్ 8096958096 నంబర్ ద్వారా ద్వారా వెంటనే పొందవచ్చు. దీనివల్ల వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నారు.
WhatsApp ద్వారా SSC ఫలితాలు ఎలా పొందాలి:
1.మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.
2.WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
3.“SSC Result” అని టైప్ చేయండి.
4.మెనులో Open Service ఎంపికపై క్లిక్ చేయండి.
5.మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6.వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో అందుతుంది.






