- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సృష్టి’ ఫర్టిలిటీ వ్యవహారం.. కేసు సీసీఎస్ సిట్‌కు బదిలీ
‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును గోపాలపురం (Gopalapuram) పోలీసుల నుంచి సీసీఎస్ సిట్ (CCS SIT) బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మొత్తం 25 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Doctor Namrata)పై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.
అయితే, కేసుకు సంబంధించి డీసీపీ రష్మీ పెరుమాళ్ (DCP Rashmi Perumal) కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. డాక్టర్ నమ్రత చాలా ఏళ్లుగా హ్యుమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతూ.. తతంగాన్ని నడుతున్నారని తెలిపారు. ఫెర్టిలిటీ కోసం వేరే డాక్టర్ వద్ద ఉన్న లైసెన్స్ అక్రమంగా వాడుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని అమాయకుల నుంచి భారీ ఎత్తున డబ్బులు దండుకున్నారని తెలిపారు. పిల్లలు పుట్టని తల్లిదండ్రులకు సికింద్రాబాద్ (Secunderabad)కు పిలిపించుకుని డాక్టర్ నమ్రత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం విశాఖ (Vishakha) కేంద్రంగా సరోగసి ట్రీట్‌మెంట్ ఇచ్చేవారని తెలిపారు. కేసులో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేసును గోపాలపురం పోలీసుల నుంచి సీసీఎస్ సిట్‌కు అప్పగిస్తున్నా్మని అన్నారు. డాక్టర్ నమ్రత అక్రమార్జనను ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారనే విషయాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నామని డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.






