Sripal Reddy : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం

by Muthe.Rajitha |

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగుతున్న విషయం తెలిసిందే.

Sripal Reddy : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. వరంగల్ -ఖమ్మం- నల్గొండ(Warangal-Nalgonda-Khammam) స్థానం నుంచి ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి(Sripal Reddy) ఘన విజయం సాధించారు. ఈ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి(PRTU Candidate)గా ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీపాల్ రెడ్డి విజయం అందుకున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27 పోలింగ్ జరిగింది. వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం నల్గొండలో జరిగింది.

ఇక్కడ మొత్తం 93.55 శాతం ఓటింగ్ నమోదు కాగా, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 24,139 ఓట్లు పోలయ్యాయి. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో.. ఎలిమినేషన్ విధానం చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కరీంనగర్-అదిలాబాద్-మెదక్ -నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(Malka Komuraiah) గెలుపొందారు.

Next Story