- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్(ఆర్డీసీ) చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని రోడ్లు-భవనాలు శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలకు వంద శాతం న్యాయం చేస్తానని అన్నారు. రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు పాల్గొన్నారు.






