Srinivas Goud: ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదు?

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని మాజీమంత్రి వి.శ్రీనివాసగౌడ్ విమర్శించారు.

Srinivas Goud: ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని మాజీమంత్రి వి.శ్రీనివాసగౌడ్ విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిందని.. విద్యార్థుల భవిష్యత్ కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుందని చెప్పారు. అసెంబ్లీలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల గురించి బిల్లు పాస్ చేశారు కానీ ఇప్పుడు విద్య ఉద్యోగాలు ఎక్కడకు పోయాయి? ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదు? అని నిలదీశారు. సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకుని తమకు ఓట్లు వేయాలని సీఎం అంటున్నారని.. మరి రెండేళ్లుగా ఎందుకు చీరలు ఇవ్వలేదని ప్రశ్నించారు. చీర కట్టుకొని ఓటు వేయండని బహిరంగంగా అంటున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని నిలదీశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఒక్క బీసీ సర్పంచ్ లేరని.. మహబూబ్‌నగర్‌లో చాలా గ్రామాల్లోనూ వార్డు మెంబర్లు సైతం లేరని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం ఒక్కటే అభివృద్ధి కాదని.. పాలమూరు-రంగారెడ్డి ఎక్కడకు పోయిందని నిలదీశారు. మూడు వేల కోట్లు పోతాయి అని కిషన్‌రెడ్డి మాట్లాడగానే రేవంత్ ఎన్నికలకు పోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story