- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బురద తప్ప ఏమీ ఉండదు: జూరాల లిఫ్ట్‌పై శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు
పాలమూరుపై బీఆర్ఎస్ ఉద్యమబాట పట్టగానే ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. తాము పాదయాత్ర చేస్తామని అంటేనే ప్రభుత్వంలో స్పందించిందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరుపై బీఆర్ఎస్ ఉద్యమబాట పట్టగానే ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. తాము పాదయాత్ర చేస్తామని అంటేనే ప్రభుత్వంలో స్పందించిందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పాలమూరు పర్యటనకు కర్ణాటక మంత్రి బోసు రాజు వస్తున్నారని.. ఆయన ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా లేనేలేరని అన్నారు. మంత్రిగా లేని వ్యక్తిని తీసుకొచ్చి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని అన్నారు. మరోవైపు.. జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవని.. ఎండిపోయిన ప్రాజెక్ట్‌లు చూసేందుకు పాలమూరుకు సీఎం వచ్చారని ఎద్దేవా చేశారు.
బురద తప్ప ఏమీ ఉండదు:
శ్రీశైలం దగ్గర ఈ రోజుకు నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదని.. నీళ్లు లేని జూరాల దగ్గర లిఫ్ట్ పెడితే, బురద తప్ప ఏమీ ఉండదని వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని.. అరెస్టులతో భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. అక్రమ అరెస్ట్‌లు వెంటనే ఆపేసి, రైతులు పండించిన ధ్యానం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరులో ప్రాజెక్ట్‌లు కట్టింది కేసీఆర్ అని.. 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనులను పూర్తి చేయాలని అన్నారు. ఆర్టికల్చర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ నిర్లక్ష్యంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో లష్కర్ ఉద్యోగాలు ఇస్తామని సీఎం మాట తప్పారని గుర్తుచేశారు.






