- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈఎన్సీ అడ్మిన్‌గా శ్రీనివాస్.. ఉత్తర్వులు జారీ చేసిన నీటి పారుదల శాఖ
నీటి పారుదల శాఖలో అత్యంత కీలక పరిణామంతో చోటుచేసుకుంది. ఈఎన్సీ అడ్మిన్‌గా తమటం శ్రీనివాస్ నియమితులయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సాగునీటి రంగంలో కీలకమైన ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పనిచేస్తున్న తమటం శ్రీనివాస్‌కు ఈఎన్సీ (అడ్మిన్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ఇప్పటి వరకు ఈఎన్సీ అడ్మిన్‌గా ఉన్న రమేశ్‌ను ఇటీవలే ఈఎన్సీ జనరల్‌గా నియమించారు. దీంతో అడ్మిన్ స్థానం ఖాళీ అయింది. పరిపాలనా అవసరాలు, శాఖలో ఖాళీ ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాన్ని చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీనివాస్ ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. శ్రీనివాస్ శాఖాపరమైన పరిపాలన, సాంకేతిక కార్యకలాపాల సమన్వయం, కీలక ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల అమలు, పునరుద్ధరణ, నిర్వహణలో ఈ పదవికి కీలక ప్రాధాన్యత ఉంది.






