- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'శ్రీకాంతాచారి బలిదానంతోనే ఉద్యమం ఉధృతం'
శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిందని ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.

దిశ నేరేడుచర్ల : శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతోనే నాటి తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిందని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. తెలంగాణ మలిదశ తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి 13వ వర్ధంతిని నేరేడుచర్ల పట్టణంలో జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతచారి బలిదానం చేసుకుని ఉవ్వెత్తున ఉద్యమాన్ని రగిలించాడన్నారు. అగ్నికి ఆహుతై తన ప్రతి కణాన్ని విప్లవాగ్నికి అంకితం చేశాడన్నారు.
మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ వీరుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో భావితరాల బంగారు భవిత కోసం దశాబ్దాల తరబడి స్వరాష్ట్ర సాధన కోసం ఎందరో వీరుల బలిదానాలను కళ్లారా చూసిన శ్రీకాంత్ చారి నేను సైతం అంటూ తనువు చాలించారని గుర్తుచేశారు. నాటి పాలకులు అవలంబించిన విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచాడన్నారు. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనే లక్ష్యంగా జై తెలంగాణ అని నిలదీస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుటించుకున్నాడని గుర్తుచేశారు. సుమారు 1200 మంది చేసిన అపూర్వ ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు.
శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి సుందరయ్య, మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, బీసీసంఘం నాయకులు టి శ్రీకాంత్, ఊదర వెంకన్న, తునికి పాటి జగన్నాధాచారి, కోపగాని మారయ్య గౌడ్, బచ్చలికూరి సుందర్రావు, గాదే సైదులు, రాంప్రసాద్, శ్రీపాద శ్రీనివాసాచారి, ఇంజమూరి వెంకటయ్య పాల్గొన్నారు.






