Sports Policy: 5 ప్రధాన అంశాలతో తెలంగాణ క్రీడా పాలసీ: వాకిటి శ్రీహరి

by Prasad Jukanti |

స్పోర్ట్స్ పాలసీపై మంత్రి వాటికి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sports Policy: 5 ప్రధాన అంశాలతో తెలంగాణ క్రీడా పాలసీ:  వాకిటి శ్రీహరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: 5 ప్రధాన అంశాలతో తెలంగాణ క్రీడా పాలసీ (Sports Policy) రూపకల్పన చేశామని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. క్రీడల అభివృద్ధి, స్కిల్ డెవలప్ మెంట్, మౌలిక సదుపాయలు ఈ పాలసీలో ఉంటాయన్నారు. ఇవాళ హెచ్ ఐఐసీ లో జరుగుతున్న ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ సందర్భంగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పటిష్టమైన క్రీడా విధానాన్ని రూపొందించామని పారదర్శకమైన జవాబుదారితనం ఈ పాలసీలో ఉండబోతున్నదన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ఆరా తీస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలోనే స్పోర్ట్స్ లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాలన్నారు. గ్రామ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మని రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. క్రీడాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మరో దశాబ్దకాలంలో క్రీడల్లో తెలంగాణ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందన్నారు.

Next Story