- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సభలో హరీశ్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు.. ఉద్యోగుల సమస్యలపై ఫైర్
హరీశ్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రస్తావించిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పందించారు. ఉద్యోగుల గురించి హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. జీరో అవర్ లో సభ్యుల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకుంటామన్నారు. అంతకు ముందు హరీశ్ రావు సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‍లో ఉన్నది మన తెలంగాణలోనే అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిన ఇంత వరకు పీఆర్సీ ఇవ్వలేదని వెంటనే పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పై తాము జీవో తీసుకువస్తే దీన్ని అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని దాన్ని వెంటనే అమల్లోకి తేవాలన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ తదిర బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు వైద్యం కూడా చేయించుకోలేక మరణించారని హరీశ్ రావు ఆరోపించారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మారుస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని, గడిచిన రెండేళ్లుగా సీపీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. పోలీసు శాఖలో ఐదు సరెండర్ లీవ్ లు పెండింగ్‍లో ఉన్నాయి. టీఏ, డీఏ, స్టేషన్ అలవెన్స్ లు రావడం లేదన్నారు. పోలీసులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఆరోగ్యభద్రతను పునరుద్ధరించాలని కోరారు.






