- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు: బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వ అజెండా అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వ అజెండా అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీఆర్ఎస్, బీజేపీ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా శనివారం శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డి గూడలోని పలు కాలనీల్లో శ్రీధర్‌బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పాలనలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలను ఓటర్లకు వివరించారు. మేం వేసే ప్రతి అడుగు భావితరాల భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి కోసమేనని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నారు. చాలా కాలనీలు, బస్తీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో నిలదీయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ... స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్ ను ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డా.రియాజ్ తదితరులు పాల్గొన్నారు.






