శ్రీరాముని జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం..

by Taduka Kalyani |

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు.

శ్రీరాముని జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం..
X

దిశ, రామకృష్ణాపూర్: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్‌తో పాటు క్యాతనపల్లిలోని పలు హనుమాన్ ఆలయాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజాతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. సీతారాముల వంటి ఆదర్శ దంపతులు ఈ విశ్వంలో లేరని, రాముడు చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. కుటుంబ విలువలు, ధర్మపాలన, కష్టకాలంలో జీవన విధానం ఎలా ఉండాలో శ్రీరాముడు తన జీవితంతో చూపించాడని పేర్కొన్నారు. శ్రీరామ రాజ్యం ద్వారా ప్రజలకు ఆదర్శ పరిపాలనను అందించిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, డీ కొండా శ్యామ్ గౌడ్, కౌన్సిలర్లు భీమ మల్లేష్, గుర్రం శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story