- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందు కోడిచెరువు ప్రభుత్వానికి అప్పగించు.. పవన్ కల్యాణ్‍కు కవిత కౌంటర్
పవన్ కల్యాణ్ కోటి చెరువు భూమిని ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని, తెలంగాణ బరాబర్ తమ జాగీరేనని బిఆర్ఎస్ నేత కవిత ఘాటుగా స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్న కోటి చెరువు కబ్జా ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువును తాను ఆక్రమించాననని అనుకుంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ అన్నారని, ఈ చెరువు శిఖం భూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నారని అందువల్ల వెంటనే పవన్ కల్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి అక్కడ వేసిన కంటెను, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. కోడి చెరువులో భూమిని పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అనేక తప్పిదాలు దొర్లాయని ఇందులో 3 ఎకరాలు మాత్రమే శిఖం భూమి అని మిగతా 7 ఎకరాలు మాగాణి అని రాశారని కానీ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం ఈ 10 ఎకరాలు శిఖం భూమి అని స్పష్టంగా ఉందని దీనిపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.
ఇది బరాబర్ మా జాగీరే!:
ఇటీవల పవన్ కల్యాణ్ హైదరాబాద్‍లో మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. ఇది బరాబర్ మా జాగీరేనని 1200 మంది అమరవీరుల త్యాగాలు, కడుపు కట్టుకుని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఇక్కడి ప్రజల సొత్తు అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ తాతల, ముత్తాతల జాగీరు కాదన్నారు. ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయవచ్చు, కానీ నైతికత ఉండాలన్నారు. మీ వల్లే నాడు మా వనరులు దోచుకోబడ్డాయి, మా సంస్కృతి మరుగున పడిపోయిందని ఆగ్రహంవ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో నాయకులు లేరని అందుకే పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చి రెండు ఓట్ల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
గద్దర్ కు కారు కోనివ్వడంపై..
గతంలో గద్దర్‌కు కారు కొనిచ్చానని ఇప్పుడు పవన్ చెప్పుకోవడం ఏంటి? అని కవిత ప్రశ్నించారు. కళాకారుడిని అవమానించడం ఏంటని నిలదీశారు. మీ సినిమాలకు నైజాం ప్రాంతం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని ఆ లెక్కన మీరు కొన్న ప్రతి కారు, భూమిలో మా తెలంగాణ ప్రాంత ప్రజల డబ్బులు ఉన్నాయన్నారు. మీరు ఎంతమంది ఫోక్ సింగర్స్ ట్యూన్లను కాపీ చేసి సినిమాల్లో పెట్టుకోలేదూ? ఫోక్ సింగర్స్‌ను, చిన్న నిర్మాతలను ఎప్పుడైనా మీరు ఆదుకున్నారా?అని నిలదీశారు. మీరు ఒకటి అంటే మేము వంద అనాల్సి వస్తుందన్నారు.
అప్పుడు ఇప్పుడు కేటీఆర్ పాలనే:
తెలంగాణ వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కవిత ఆరోపించారు. అప్పుడు గత ప్రభుత్వం KTR ( కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు) పాలనే నడిచిందని ఇప్పుడూ KTR (కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి) పాలనే నడుస్తోందని విమర్శించారు. గత హాయంలో దోపిడికీ కిటికీలు తెరిస్తే ఇప్పడు ఏకంగా తలుపులు తెరిచారన్నారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ వెళ్తే భవిష్యత్ అవసరాలకు ఏమి మిగలదన్నారు. ఈ ప్రభుత్వ భూదందా అంతా బయటపెడతామన్నారు.






