- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhadrachalam: శ్రీరాముని కల్యాణానికి వెళ్ళలేకపోతున్నామని బాధపడొద్దు.. భద్రాచలం నుంచి మీకు అదిరే శుభవార్త!
Bhadrachalam: దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈనెల 6వ తేదీన రామయ్య కల్యాణం నిర్వహించడానికి సర్వం సిద్ధం అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: Bhadrachalam: దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈనెల 6వ తేదీన రామయ్య కల్యాణం నిర్వహించడానికి సర్వం సిద్ధం అవుతోంది. రాములోరి కల్యాణం కనులారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలానికి పయనం అవుతున్నారు. మరోవైపు రాములోరి కల్యాణంలో ఉపయోగించిన అక్షింతలను, తలంబ్రాలను ప్రతి ఒక్క భక్తులు సొంతం చేసుకోవాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు.
అయితే మీరు సారి రాములోరి కల్యాణానికి భద్రాచలం వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్నారా. అయితే మీ ఇంటికే తలంబ్రాలు, అక్షింతలు వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అద్బుతమైన సదుపాయాన్ని కల్పించింది పోస్టల్ డిపార్ట్ మెంట్. అర్చన తలంబ్రాలు, అక్షింతలను సేవ అర్డర్ లు బుక్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ పోస్టల్ సర్కిల్. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ సహకారం కూడా తీసుకుంది పోస్ట్ శాఖ.
అక్షింతలు, తలంబ్రాలు మాత్రమే కాదు ప్రసాదం కూడా పొందవచ్చు. ఈ సేవలను పొందాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో ఒకసారి సంప్రదించండి. భక్తులకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నుంచి ప్రసాదం, ముత్యాల కల్యాణ తలంబ్రాలు భక్తుల చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ చేస్తారు. అయితే భక్తులు ముత్యాల తలంబ్రాల కోసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాములోరి కల్యాణానికే కాదు పట్టాభిషేకం కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాచలం శ్రీరాముని కల్యాణానికి వెళ్ళలేని భక్తులకు పోస్టల్ డిపార్ట్మెంట్ అద్భుత అవకాశం #Bhadrachalam #SriSeethaRamulaKalyanam #ThanikellaBharani #BhakthiTV pic.twitter.com/4d98ch2iS9
— BhakthiTV (@BhakthiTVorg) April 2, 2025






