HYD: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి SRH ప్లేయర్లు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి(Peddamma Talli Devalayam) ఒకటి.

HYD: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి SRH ప్లేయర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి(Peddamma Talli Devalayam) ఒకటి. రోజూ ఈ ఆలయాన్ని వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటారు. తాజాగా ఈ ఆలయానికి ప్రముఖ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), అభిషేక్ శర్మ(Abhishek Sharma) వచ్చారు. శనివారం ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వారిని చూసి షాకయ్యారు.

పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు వీళ్లేకుండా పోయింది. కాగా, రేపు ఉప్పల్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు తలపడబోతోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో SRH నాలుగు మ్యాచులు ఆడి ఒకటి గెలిచి, మూడు ఓడింది. మూడు మ్యాచులు ఆడిన గుజరాత్ జట్టు.. ఒకటి గెలిచి రెండు ఓడింది. దీంతో వరుస ఓటములతో ఉన్న ఈ రెండు జట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుమీదున్నాయి. మరి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.



Next Story