- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరైన శ్రీముఖి, నిధి అగర్వాల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రముఖ యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి నేడ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలు ఎంత డబ్బు తీసుకున్నారు, ఆ యాప్స్ నడిపిన వ్యక్తులతో వారి సంబంధం ఏమిటి, డబ్బుల లావాదేవీలు ఎలా జరిగాయి అనే విషయాలపై సీఐడీ అధికారులు వారిని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలను సీఐడీ విచారించింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని ప్రచారం చేసిన సెలబ్రిటీల పాత్రను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.






