శ్రవణ్ రావు చీటింగ్ కేసు.. ఒక్కరోజు కస్టడికి అనుమతించిన కోర్టు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌ రావు (Sravan Rao) ఇటీవలే ఓ చీటింగ్ కేసు (Cheating Case)లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

శ్రవణ్ రావు చీటింగ్ కేసు.. ఒక్కరోజు కస్టడికి అనుమతించిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌ రావు (Sravan Rao) ఇటీవలే ఓ చీటింగ్ కేసు (Cheating Case)లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అఖండ ఎంటర్‌ప్రైజెస్ (Akhanda Enterprises) అనే సంస్థకు రూ.6 కోట్ల మేర నష్టం కలిగించారని, మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు సీసీఎస్‌ పోలీసు(CCS Police)లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు శ్రవణ్ రావు‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 13న అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు శ్రవణ్ రావును నాంపల్లి కోర్టు (Nampally Court)లో ప్రవేశ పెట్టారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును విచారించాలని.. అందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడిని ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జరీ చేశారు. మరికాసేపట్లో చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

Next Story