సైబర్ మోసాలు.. ఇకపై ఎస్పీలకు ఫుల్ పవర్స్

by Muthe.Rajitha |

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలకు(Cyber Crimes) అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సైబర్ మోసాలు.. ఇకపై ఎస్పీలకు ఫుల్ పవర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలకు(Cyber Crimes) అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ఎస్పీలకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు సమాచారం. సైబర్ మోసగాళ్లను గుర్తించినపుడు అప్పటికప్పుడు వారి నంబర్లను బ్లాక్ చేయించే అధికారాన్ని ఎస్పీలకు కట్టబెడుతూ కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం. అలాగే అనుమానితుల లొకేషన్లు, బ్యాంకు వివరాలు, టెలికాం వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపేందుకు అనుమతినిచ్చింది.

అలాగే దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తోంది. అయితే ఇది ఇంకా పైలట్ ప్రాజెక్టు దశలోనే ఉంది. కాగా ఈ పైలట్ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం కూడా ఎంపికైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Next Story