- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్ సర్వీస్ ఫలితాలలో SP కూతురుకు మూడవ ర్యాంకు
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడవ ర్యాంకు సాధించింది.

X
దిశ ప్రతినిధి, నారాయణపేట : సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు - శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమా హారతి జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో ఐఐటీ పూర్తి చేసిన ఉమా హారతి తన నాలుగవ ప్రయత్నంలో ఈ ఘనతను సాధించింది. ఉమా హారతి సోదరుడు సాయి వికాస్ 2021వ సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో జాతీయస్థాయిలో 12వ ర్యాంకును సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈనెల 22వ తేదీన విధులలో చేరాడు. సివిల్ సర్వీసెస్‌లో మూడవ ర్యాంకును సాధించిన ఉమా హారతితో పాటు, ఆమె తల్లిదండ్రులకు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు శుభాభినందనలు తెలుపుతున్నారు.
Next Story






