- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడలు దేశ కార్యకలపాల్లో ముఖ్య భాగమైనవి : బీజేపీ చీఫ్రాంచందర్రావు
ప్రస్తుతం క్రీడలు మన జీవితంతో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం క్రీడలు మన జీవితంతో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు. గతంలో మనం బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేకపోయేవాళ్లమని ఇప్పుడు మన క్రీడాకారులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను ఒలింపిక్స్‌లో కూడా గెలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ సీనియర్క్యోరుగి ఛాంఫియన్షిప్ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
క్రీడలతో పాటు హైదరాబాదును కూడా చూసి, హైదరాబాదు అతిథ్యసత్కారాన్ని ఆస్వాదించాలి. హైదరాబాదు బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లాంటి దేశం నలుమూలల నుంచి వచ్చి పాల్గొంటున్న ప్రతీ అథ్లెట్‌కు సూచించారు. ప్రస్తుత భారత ప్రభుత్వం క్రీడలపై 2014తో పోలిస్తే 130 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు. కో కుడోక్, కో ఇండియా లాంటి కార్యక్రమాలు యువత క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచాయని ఈ పోటీలు క్రీడాకారుల్లో మరింత ప్రతిభను వెలికితీస్తాయని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఇస్తాయన్నారు.
ఈ స్టేడియం 2001–02లో నిర్మించబడిందని ఇక్కడ ఆఫ్రో–ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు జరిగాయని గుర్తు చేశారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత అభివృద్ధి క్రీడల బలోపేతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, జాతీయ ఏకీకరణ అంశాలను బలపరిచే శక్తిగా క్రీడలను మరింత మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. దేశ నిర్మాణంలో క్రీడలు ఒక శక్తివంతమైన మార్గదర్శక శక్తిగా నిలవాలనే సంకల్పం ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.






