అసెంబ్లీ పాత భవన పునరుద్దరణ పనులను వేగవంతం చేయండి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశం

by Muthe.Rajitha |

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

అసెంబ్లీ పాత భవన పునరుద్దరణ పనులను వేగవంతం చేయండి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్​ నరసింహా చార్యులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, అగాఖాన్ సంస్థ అధికారులు, అలాగే సంబంధింత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, రానున్న సమావేశాలు ఈ భవనంలో జరపాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర సర్కారు ఉందని గుత్తా సుఖేందర్​రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. అలసత్వం వదిలి ఆర్ అండ్ బి శాఖ అధికారులు, అగాఖాన్ సంస్థ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసి, నిర్ణీత సమయానికి భవనాన్ని అప్పగించాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.

Next Story