MP Laxman: ఆరు కాదు అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు: ఎంపీ లక్ష్మణ్

by Prasad Jukanti |

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

MP Laxman: ఆరు కాదు అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నదని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ (MP Laxman) విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ అబాసుపాలయ్యారని దుయ్యబట్టారు. మంత్రులు ఒకరిపై మరొకరు పోట్లాడుకుంటున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీఆర్ఎస్ (BRS) అడ్రస్ గల్లంతు అయిందని కనీసం అభర్థిని పెట్టే సాహసం చేయలేకపోయిందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న వ్యక్తిని బరిలోకి దింపిందని విమర్శించారు. కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ఉద్యోగులకు దగా చేస్తే రేవంత్ రెడ్డి అంతకు ఎక్కువ దగా చేస్తున్నారన్నారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అడ్డుకోవాలన్నారు.

ఆరు కాదు అర గ్యారెంటీ అమలు చేయలేదు:

ఆరు గ్యారెంటీలు (Six guarantees) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఇప్పటి వరకు అర గ్యారెంటీ కుడా అమలు చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీవన్నీ 420 హామీలే అన్నారు. 2023 జులై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ దిక్కు దివానా లేకుండా పోయిందన్నారు. వేతన సవరణ సంఘం అసలు ఉందా లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులును మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గాలికి వదిలేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందుకున్న వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కడం లేదని అది మోడీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా అన్నారు.

Next Story