- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGMREIS: మైనారిటీ బాలికలకు కెరీర్ ప్లానింగ్‌పై ప్రత్యేక శిక్షణ
మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు సిద్ధం చేసి, వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు సిద్ధం చేసి, వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎంఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో, లాంచ్ గర్ల్స్ సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన ఐదు రోజుల కెరీర్ రెడీనెస్ బూట్‌క్యాంప్ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ బూట్‌క్యాంప్‌లో నాలుగు జూనియర్ కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వారికి నాయకత్వ లక్షణాల పెంపు, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆర్థిక అవగాహన, కెరీర్ ప్లానింగ్ వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భవిష్యత్ లక్ష్యాల సాధనకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన బూట్‌క్యాంప్
పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ బూట్‌క్యాంప్ ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా టీజీఎంఆర్ఈఐఎస్ పరిధిలోని 98 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 15,520 మంది విద్యార్థినులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు మరింత సమర్థంగా సిద్ధం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.






