బిడ్డా.. భయపడకు! ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఇలా సమాధానం చెప్పు!!

by Dishanational1 |
బిడ్డా.. భయపడకు! ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఇలా సమాధానం చెప్పు!!
X

సీబీఐ విచారణ ఎదుర్కోబోతున్న ఎమ్మెల్సీ కవితకు తండ్రి, సీఎం కేసీఆర్​మనోధైర్యం చెప్పారు. బిడ్డా.. భయపడకు అంటూ ఓదార్చినట్టు తెలిసింది. ఆందోళన చెందవద్దని నిపుణులతో కౌన్సిలింగ్​ఇప్పించినట్టు సమాచారం. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు ఎక్స్​పర్ట్​అడ్వొకేట్స్​కవితకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అన్ని ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? వాటిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే అడిగితే ఏం చెప్పాలి? రిమాండ్​లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, అమిత్ ఆరోరాతో ఉన్న పరిచయాలపై ప్రశ్నలు అడిగితే ఏ మేరకు చెప్పాలి? వంటి అంశాలతో మాక్​ ఎంక్వైరీ నిర్వహించినట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: కూతురు కవితకు సీఎం కేసీఆర్ ధైర్యం నూరిపోసినట్టు తెలిసింది. భయం, ఆందోళన లేకుండా సీబీఐ విచారణ ఎదుర్కోవాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు న్యాయ నిపుణులు, సీబీఐ కేసులను వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్​తో ఆయన కవితకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షిగా విచారణ చేసేందుకు కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయమే కవిత ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేసినట్టు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతున్నది.

సీబీఐ విచారణపై తర్పీదు

ఈ నెల 6న సీబీఐ అధికారులు ఆమె ఇంట్లో కవితను విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా సీబీఐ ఆఫీసర్లు ఏవిధంగా ప్రశ్నలు అడుగనున్నారు. వాటికి ఎలా స్పందించాలి? ఏ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలి? అనే విషయాలపై సుమారు 15 మంది లీగల్ టీమ్ తో కవితకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ టీమ్ లో సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జీలు, గతంలో సీబీఐ కేసులను వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉన్నట్టు సమాచారం. వీరంతా సీబీఐ అధికారుల నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో చెపుతూ, వాటికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలో పూసగుచ్చి వివరించినట్టు తెలిసింది.

మాక్ ఎంక్వయిరీ

అన్ని ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫోన్లను ధ్వంసం చేయాల్సిన​అవసరం ఎందుకు వచ్చిందనే అడిగితే ఏం చెప్పాలి? రిమాండ్​లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, అమిత్ ఆరోరాతో ఉన్న పరిచయాలపై ప్రశ్నలు అడిగితే ఏ మేరకు చెప్పాలి? ఇలా లీగల్ ఎక్స్​పర్ట్స్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

Read More.....

కారు దిగడానికి రె'ఢీ'



Next Story

Most Viewed