- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ జిల్లాగా ‘గ్రేటర్’!
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శా ఖల ఆర్గనైజేషనల్ సెటప్ ఒకేలా ఉండాలని ప్రభు త్వం చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఏరియాను హైదరాబాద్ జిల్లాగా మార్చనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బర్ రీజియన్ (టీసీయూఆర్)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రీజియ న్ పరిధిలో ఒక్కో శాఖ స్వరూపం ఒక్కో విధంగా ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, పోలీసు, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, కమర్షియల్ ట్యాక్స్, రెవె న్యూ శాఖలకు వేర్వేరు సెటప్‌లు ఉన్నాయి. వీటన్నింటిని సమన్వయం చేయడం సమస్యగా మారిం ది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శా ఖల ఆర్గనైజేషనల్ సెటప్ ఒకేలా ఉండాలని ప్రభు త్వం చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఏరియాను హైదరాబాద్ జిల్లాగా మార్చనున్నారు.
టీసీయూఆర్‌లో..
జీహెచ్ఎంసీలోని 150 వార్డులతోపాటు 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి 300 వార్డులుగా పునర్విభజించారు. దీన్ని 150 వార్డులతో జీహెచ్ ఎంసీ, 76 వార్డులతో సీఎంసీ, 74 వార్డులతో ఎం ఎంసీగా ఏర్పాటు చేస్తూ ఈ నెల 11వ తేదీన ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. అయితే గతంలో జీహెచ్ఎంసీ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండేది. ఏదైనా సమస్య వచ్చినా, ఎన్నికలు జరిగినా నాలుగు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాల్సి వచ్చేది. దీంతోపాటు హైదరాబాద్ ఎయిర్ పోర్టుగా చెప్పుకుంటున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు రంగారెడ్డి జిల్లాలో ఉంది. కొత్త హైకోర్టు కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉంది. శాంతి భద్రతలకు సంబంధించిన పోలీసు కమిషనరేట్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏర్పాటు చేశారు. వీటన్నింటిని ఒకే రెవెన్యూ పరిధిలో ఉండేలా హైదరాబాద్ జిల్లాగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.






