చెంగిచెర్ల ‘మటన్’ మ్యాజిక్.. రూ.450కే కేజీ వెనుక అసలు రహస్యం ఇదే!

by Gantepaka Srikanth |

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో మటన్ ముక్క పడాల్సిందే. కానీ, హైదరాబాద్ మహానగరంలో బహిరంగ మార్కెట్లలో కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు మటన్ జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

చెంగిచెర్ల ‘మటన్’ మ్యాజిక్.. రూ.450కే కేజీ వెనుక అసలు రహస్యం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో మటన్ ముక్క పడాల్సిందే. కానీ, హైదరాబాద్ మహానగరంలో బహిరంగ మార్కెట్లలో కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు మటన్ జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, అదే నగర శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల (Chengicherla) ప్రాంతానికి వెళ్తే మాత్రం సీన్ పూర్తిగా మారిపోతుంది. అక్కడ కేజీ మటన్ కేవలం రూ.450లకే.. అది కూడా ఎంతో ఫ్రెష్‌గా లభిస్తుంది. దీంతో నగరంలోని నలుమూలల నుంచి మాంసప్రియులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అయితే, నగరమంతటా వెయ్యి రూపాయలు ఉన్న మటన్.. ఇక్కడ సగం ధరకే (రూ.450) ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటో కింది వీడియో ద్వారా తెలుసుకుందాం.

Next Story