CM Revanth Reddy: ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: సీఎం

by Prasad Jukanti |

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండగలా నిర్వహిచాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.

CM Revanth Reddy: ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్‍లో (Secretariat) కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల (Indiramma Sarees) పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందని, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు.

Next Story