ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదును పెంచుటకు ప్రత్యేక చర్యలు

by Dishanational2 |
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదును పెంచుటకు ప్రత్యేక చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదును పెంచుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి బహిరంగ లేఖ వ్రాసారు . రాష్ట్ర ప్రభుత్వం 2023 24 విద్య సంవత్సరం లో పాఠశాలలో విద్యాబ్యాసం సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తనలేఖలో వివరించారు . మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా ముఖ్య మంత్రి ప్రతిపాదించిన బడి ఈడు పిల్లలు అధికంగా వున్నా గ్రామాలూ లేదా ఆవాసాలలో వున్న పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పించాలని ఆదేశించిన అందుకు బిన్నంగా చేపట్టారని వీటిపై ఒకసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు .

ముఖ్యంగా 2022 -23 విద్య సంవత్సరంలో పాఠశాలలో 20 శాతానికిపైగా ఉపాధ్యాయుల కొరత ఉందని కొత్తవారిని నియమించే వరకు ఐదు వేలమంది తాత్కాలిక ఉపాధ్యాయులను నియామకం చేపట్టాలని కోరారు . పాఠశాల నిర్వహణకు అదనపు గ్రాంటుఇవ్వాలని డిమాండ్ చేసారు . 90 శాతానికి పైగా పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలనీ పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి రూ 200 కోట్ల బడ్జెట్ కేటాయించాలని తద్వారా 26000 పాఠశాలలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు . ఇంటర్ విద్యార్థులు నమోదు మోడల్ పాఠశాలల్లో తగ్గిందని వాటిపై దృష్టిసారించాలని కోరారు . కె జి బి వి పాఠశాలలో ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించేందుకు కేర్ టేకర్ ను పనుల కొరకు అదనపు సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్న క్రమంలో పాఠశాలలో విద్యార్థులు నమోదు పెంపుదలకు గ్రామసర్పంచులు ,వార్డ్ సభ్యులు ఎంపిటిసి కౌన్సెలర్లులు ,కార్పొరేటర్లు సహకరించేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ , మున్సిపల్ శాఖకు తగు సూచనలు ఇవ్వాలని తన లేఖలో కోరారు .

Next Story

Most Viewed