- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు: డీజీపీ
సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఐక్య ఫ్రంట్ అవసరం అని, సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి, సైబర్ నేరాలను నుంచి పౌరులను రక్షించడానికి సమిష్టి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని డీజీపీ డా. జితేందర్ తెలిపారు

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఐక్య ఫ్రంట్ అవసరం అని, సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి, సైబర్ నేరాలను నుంచి పౌరులను రక్షించడానికి సమిష్టి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని డీజీపీ డా. జితేందర్ తెలిపారు. డీజీపీ జితేందర్ అధ్యక్షతన దక్షణాది రాష్ట్రాల డీజీపీల త్రైమాసిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ డా. జితేందర్ మాట్లాడుతూ.. సైబర్ బెదిరింపులు రోజురోజుకు పెరుగుతున్నందున అంతర్-రాష్ట్ర సమన్వయం, అంతర్జాతీయ సహకారం, బ్యాంకింగ్, టెలికాం రంగాలతో సమన్వయం, సైబర్ శిక్షణ, పెంపొందించుకోవడానికి దృష్టి సారించాలని తెలిపారు. సైబర్ బాధితులకు సకాలంలో న్యాయం, భరోస అందించడానికి చట్టపరమైన విధానాలలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. క్రిప్టోకరెన్సీ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్, సిఐడి డిజి, శిఖా గోయల్ ఐ4సీ సీఈవో, ఐపీఎస్ రాజేష్ కుమార్ , పాల్గోనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడు ఏడీజీపీ సైబర్ క్రైమ్ సందీప్ మిట్టల్, కేరళ ఏడీజీపీ సైబర్ క్రైమ్ హెచ్ వెంకటేష్ , ఐజీపీ ఈగిల్ ఎ. రవి కృష్ణ ఐపీఎస్, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ సైబర్ క్రైమ్, ఎ అండ్ ఎన్ మనోజ్ కె మీనా, కర్ణాటక ఎస్పీ సీఐడీ అనూప్ శెట్టి , పుదుచ్చేరి ఎస్పీ సైబర్ క్రైమ్ ఎన్. చైతన్య పాల్గొన్నారు






