పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు..

by Taduka Kalyani |

ఆదిలాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు.

పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని పట్టణంలో నెలకొన్న పలు సమస్యలు,అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు. అజెండాలో పొందుపరిచిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించగా, ఎంపీ అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ సూచించారు.స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు : మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష..

పట్టణాభివృద్ధి,ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు,సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను అజెండాలో పొందుపరిచి చర్చించినట్లు తెలిపారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని,అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆమె తెలిపారు.

Next Story