- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కమిషన్కు ప్రత్యేక నిధులు కేటాయించాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు, పండ్లు , పూల తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు, పండ్లు , పూల తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఇటీవల రైతు కమిషన్ రైతులతో వ్యవసాయదారులతో కౌలు రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టిందని,ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరిగి, దిగుబడి వచ్చేలా రైతులకు సబ్సీడీ పథకాలు తేవాలన్నారు. సోమవారం కమిషన్కు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భ జలాలపై ఆధారపడిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చాలావరకు రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారని గుర్తుచేశారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలు అవుతుందని, వ్యవసాయ రంగానికి కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోందని, ఉద్యాన వన పంటలు సాగుచేసే రైతులకు ఉపాధి హామీ ని అనుసంధానం చేయాలన్నారు. పసుపు, కూరగాయలు, పూలతోటలు పండించే వారికీ యాంత్రీకరణ పద్ధతులు అవసరమని వారికి చిన్న యంత్ర పరికరాలు ఇస్తే మంచిదని సూచించారు. రాష్ట్రంలో చిన్న కమతాలు ఎక్కువగా ఉండడంతో వారికీ మరింత మేలు జరుగుతుందన్నారు. కోతుల బాధ నివారణకై ఏకైక మార్గం సోలార్ ఫెన్సింగ్ ఒక్కటే మార్గమని, రైతులు దీనిని ఏర్పాటు చేసుకోడానికి ప్రభుత్వం సబ్సీడీ ఇస్తే హార్టికల్చర్ పంట ఉత్పతులు మరింత పెరుగుతాయని అభిప్రాయ పడ్డారు. రైతు కమిషన్ ఇచ్చిన వినతికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు రైతు కమిషన్ తెలిపింది.






