- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్పెషల్ డ్రైవ్.. సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకం కింద, విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (EV PCS) ఏర్పాటును ప్రోత్సహించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక డ్రైవ్ మొదలు పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకం కింద, విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (EV PCS) ఏర్పాటును ప్రోత్సహించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక డ్రైవ్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ రాష్ట్ర సచివాలయ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అక్కడ విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (EV PCS) ఏర్పాటుకు చేసేందుకు స్పాట్‌లను గుర్తించారు. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (EV PCS) ఏర్పాటు చేసే వారికి కేటగిరీని బట్టి 100 శాతం నుంచి 70 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను సంస్థ సీఎండీ, రెడ్ కో VC, MDలు గతవారం ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లతో ఇటీవలే సమావేశమయ్యారు. నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ సంస్థ యాప్ SASAలో ప్రత్యేక ప్రోగ్రాంను రూపొందించామని, ఔత్సహికులు స్థానిక అసిస్టెంట్ ఇంజినీర్ తెలియజేస్తే, ఆ ప్రదేశాన్ని పర్యటించి వివరాలు నమోదు చేసుకుంటారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.






